తెలంగాణాలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లారీ ! 20 మంది మృతి !

Bus Accident in Telangana

Bus Accident in Telangana

Bus Accident in Telangana: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు దానికింద కూరుకుపోయారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 20 మంది మృతి చెందగా… పలువురు తీవ్రంగా గాయడ్డారు. మృతుల్లో బస్సు, లారీ డ్రైవర్లు సహా 10 మంది పురుషులు, 9 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాద సమయంలో ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మూడు జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీస్తున్నారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

బస్సులో 70 మంది ప్రయాణికులు !

Bus Accident in Telangana: టీఎస్‌ 34 టీఏ 6354 నంబరు గల ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్‌ కు ఉదయం 5 గంటలకు బస్సు బయల్దేరింది. అక్కడ 30 మందికి పైగా ఉద్యోగులు, కళాశాలలకు వెళ్లే ఉద్యోగులు ఎక్కారు. మొత్తంపై బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నారు. విద్యార్థులు హైదరాబాద్‌లోని పలు కళాశాలల్లో చదువుతున్నట్లు సమాచారం. ఆదివారం సెలవు కావడంతో ఇళ్లకు వెళ్లి… తిరిగి నగరానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్‌-బీజాపూర్‌ హైవేపై భారీగా ట్రాఫిక్‌జామ్‌ అయింది. చేవెళ్ల-వికారాబాద్‌ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 15 మంది ప్రయాణికులతో పాటు బస్సు కండక్టర్‌ రాధను పోలీసులు రక్షించారు. కండక్టర్‌కు గాయాలు కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు జరుగుతున్న సమయంలో చేవెళ్ల సీఐ భూపాల్‌ శ్రీధర్‌పైకి జేసీబీ ఎక్కడంతో ఆయన ఎడమ కాలికి గాయమైంది. సీఐను చేవెళ్ల ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

చేవెళ్ల ఘటనలో హృదయవిదారక దృశ్యాలు

చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద దృశ్యాలు హృదయాన్ని కలిచివేస్తున్నాయి. వాహనాలు వేగంగా ఒకదానికొకటి ఢీ కొనడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీస్తున్నారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

చేవెళ్ల బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Bus Accident in Telangana: చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్​ రెడ్డి (Revanth Reddy) విచారం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని రేవంత్ రెడ్డి తెలిపారు.
బస్సు ప్రమాదంలో గాయపడిన వారందరినీ వెంటనే హైదరాబాద్​‌కు తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని డీజీపీలను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుబాటులో ఉన్న మంత్రులు వెంటనే ప్రమాద సంఘటనకు చేరుకోవాలని పేర్కొన్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌‌కు సీఎం సూచించారు.

ఈ ప్రమాదంపై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చేవెళ్ళలో జరిగిన రోడ్డు ప్రమాదంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డవారికి తగిన వైద్య చికిత్సలు చేయాలని సూచించారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మృతులకు మహేష్ కుమార్ గౌడ్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

చేవెళ్ల బస్సు ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి

తెలంగాణ రాష్ట్రంలోని చేవెళ్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆర్టీసీ బస్సును కంకర లారీ ఢీకొనడంతో 20 మంది మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Also Read: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం – బొత్స సత్యనారాయణ

2 thoughts on “తెలంగాణాలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లారీ ! 20 మంది మృతి !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *