సృజనాత్మకంగా ఆలోచించండి-జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
Energy Saving Weeks
విద్యార్ధులు సృజనాత్మకంగా ఆలోచించి వినూత్న ఆవిష్కరణలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్ధులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, డ్రాయింగ్ పోటీల విజేతలకు కలెక్టరేట్ ఆడిటోరియంలో బహుమతి ప్రదానం జరిగింది. విజేతలకు ప్రశంసా పత్రం, జ్ఞాపికలను ఇచ్చి సత్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇంధనాన్ని పొదుపు చేసేందుకు కొత్త ఆవిష్కరణలు చేయాలని కోరారు. ఇంధన వనరుల లభ్యత పరిమితమని, భవిష్యత్తు తరాల కోసం ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన అవసరం ఉందన్నారు. లేదా సూర్యరశ్మి లాంటి సంప్రదాయేతర ఇంధన వినియోగాన్ని పెంచాలని సూచించారు. ఇంధనం అన్నది ప్రజలందరి ఉమ్మడి ఆస్తి అని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. అపరిమితంగా వాడితే భవిష్యత్ తరాలు నష్టపోతాయని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో డిఈఓ యు.మాణిక్యంనాయుడు, ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ ఎస్ఈ ఎం.లక్ష్మణరావు, ఈఈలు, డిఈలు, ఇతర అధికారులు, విద్యార్దులు, ఉపాధ్యాయులు పాల్గొన్నా
