లక్ష్మీనాయుడు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం – సీఎం చంద్రబాబు
నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడు గ్రామంలో హత్యకు గురైన లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులను హోం మంత్రి వంగలపూడి అనిత, మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, కందుకూరు శాసన సభ్యులు ఇంటూరి నాగేశ్వరరావులు పరామర్శించారు. లక్ష్మీనాయుడు భార్య సుజాతతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. నిందితుడికి కఠినంగా శిక్షపడేలా చూస్తామని, బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు.
నిందితుడికి త్వరితగతిన శిక్షపడేలా చేస్తామని హోం మంత్రి అనిత తెలిపారు. లక్ష్మీనాయుడు సతీమణి సుజాతను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోన్‌లో పరామర్శించారని చెప్పారు. వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యను రాజకీయ కోణంలో చూడొద్దని కోరారు. ఘటన జరిగిన వెంటనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు.
