బ్రెయిన్ యోగా ఒక అద్భుతం – పిడుగు శ్రీనివాసులు

brain yoga

brain yoga

బ్రెయిన్ యోగా ఒక అద్భుతమని బెంగళూరుకు చెందిన ప్రముఖ బ్రెయిన్ యోగ గురువు , అంతర్జాతీయ శిక్షకులు పిడుగు శ్రీనివాసులు పేర్కొన్నారు .ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్ ఆధ్వర్యంలో గురజాడ పబ్లిక్ స్కూల్ లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, మానసిక స్పష్టతను పెంచడం, ఆందోళనను తగ్గించడం, నాడీ వ్యవస్థను ఉత్తేజపరచడం, మెదడుకు రక్త ప్రసరణను పెంచడం మరియు న్యూరోన్ల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడం వంటివి బ్రెయిన్ యోగ తో సాధ్యమని అన్నారు .ఈ సందర్భంగా వివిధ ముద్రాలతో బ్రెయిన్ ఎక్సర్సైజ్ లను విద్యార్థులతో చేయించడమే కాక వాటి విశిష్టతను విపులంగా వివరించారు.ఈ సందర్భంగా యోగా గురువు పిడుగు శ్రీనివాసులను, రోటరీ లీడ్ ఇండియా చైర్మన్ దుర్గా బాలాజీ , పాఠశాల ప్రిన్సిపాల్ పూడి శేఖర్ లతో కలిసి గురు ప్రసాద్ ఘనంగా సత్కరించారు .ఈ కార్యక్రమంలో రోటరీ లీడ్ ఇండియా ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ చైతన్య , జగదీష్ ,లత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *