శిశుగృహలో నున్న అనాధ బాలుని ఆరోగ్యం పై ఆరా తీసిన కలెక్టర్
The District Collector visited the children's home.
ఒక ప్రైవేటు ఆసుపత్రిలో డయేరియా తో మూడు రోజులుగా చికిత్స పొందుతున్న అనాధ బాలుడు దేవాన్స్ ఆరోగ్యం పై కలెక్టర్ ఎస్.రాం సుందర్ రెడ్డి ఆరా తీశారు. విజయనగరం జిల్లా కలెక్టర్ దంపతులు ఆసుపత్రిలో నున్న బాలుని సందర్శించారు. నాణ్యమైన మందులు వినియోంచి బాలుని ఆరోగ్యాన్ని శ్రద్ధగా చూడాలని అక్కడి సిబ్బందికి ఆదేశించారు. బాలుని ఎత్తుకొని కొంతసేపు ఆడిపించారు. బాలునికి డయేరియా అని తెలుకున్న కలెక్టర్ విజయవాడ లో గత రెండురోజులగా ఉన్నప్పటికీ అక్కడినుండి బాలుని ఆరోగ్యం పై ఆరా తీశారు. భోగి పండగ రోజున భోగి పళ్ళు పోసిన బాలునికి దేవాన్స్ గా నామకరణం చేసింది కూడా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి కావడం విశేషం.

