గ్రామీణ మౌళిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపేట – మంత్రి కొండపల్లి శ్రీనివాస్.
Minister Kondapalli Srinivas started the road construction works
గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పురిటిపెంటలో పల్లెపండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా రూ.54 లక్షల విలువైన పంచాయతీరాజ్ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధికి ఆమడ దూరం నెట్టివేశాయని, కూటమి ప్రభుత్వం అభివృద్ధిని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు దగ్గర చేస్తుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కనీసం మౌళిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో కనీస మౌళిక వసతులకు పెద్దపీట వేసి పనులు పూర్తి చేస్తున్నామని చెప్పారు. గ్రామీణ రోడ్లు, సిసి డ్రైన్లు, గోకుల్ షెడ్స్, స్మశానాల అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనిచ్చి ఎం జి ఎన్ ఆర్ జి ఎస్ ద్వారా చేపట్టామని అన్నారు. పల్లె పండుగలో భాగంగా గజపతినగరం నియోజకవర్గంలో రూ.120 కోట్లతో పనులు ప్రారంభించామని, వీటిలో రూ. అరవై కోట్లకు పైగా పనులు పూర్తయ్యి బిల్లుల చెల్లింపులు దశకు చేరుకున్నాయని అన్నారు. మిగిలిన రూ. అరవై కోట్ల పనులు నిర్మాణ దశలో ఉండగా పల్లెపండుగ 2.0 లో భాగంగా మరో రూ. ముప్పై కోట్లపనులకు రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిందని అన్నారు.
పల్లెపండుగ మొదటి విడతలో విజయనగరం జిల్లాలో రూ. 500 కోట్ల తో పనులు చేపట్టామని, వీటిలో రూ. 200 కోట్ల పనులు పూర్తయ్యి బిల్లులు జమ చేస్తున్నామని తెలియజేశారు.ప్రజల జీవన విధానం మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెడుతూ హెల్తీ, వెల్తీ ఆంధ్రప్రదేశ్ కోసం ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి తెలియజేశారు. జిల్లాలో ఆర్ & బి శాఖ ద్వారా రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టామని, గజపతినగరం నుంచి మెంటాడ వరకు రోడ్డు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మెరుగైన రవాణా సదుపాయాల తోపాటు, ఆరోగ్యకరమైన జీవన విధానం ఉండాలని మంత్రి అన్నారు. గజపతినగరం నియోజకవర్గoలో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న పురిటిపెంట, కనిమెరక, కోమటిపల్లి వద్ద నూతనంగా ఆర్ఓబి ల నిర్మాణానికి పనులు శాంక్షన్ చేయించి పనులు చెపడుతున్నామని మంత్రి శ్రీనివాస్ తెలియజేశారు.
