అనాథ చిన్నారులతో భోగి సంబరాలు జరుపుకున్న కలెక్టర్ దంపతులు

DIST COLLECTOR RAMSUNDER REDDY

DIST COLLECTOR RAMSUNDER REDDY

విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి దంపతులు భోగి పర్వదినాన్ని అనాధ చిన్నారులతో జరుపుకున్నారు. స్థానిక కె.ఎల్.పురంలోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాథ శిశువుల ఆశ్రమంను తన సతీమణి తో బుధవారం సందర్శించి శిశుగృహలో చిన్నారులతో కలిసి భోగి పండుగ జరుపుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ దంపతులు ఆశ్రమంలోని అనాథ చిన్నారులకు భోగిపళ్లు పోసి ఆశీర్వదించారు. అనంతరం ఆశ్రమ నిర్వహణ, పిల్లల ఆరోగ్యం, పోషణపై అధికారులతో చర్చించి, చిన్నారుల సంరక్షణలో ఎలాంటి లోటుపాట్లు కలుగ కుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సంక్రాంతి ప్రజలలో సుఖసంతోషాలు, శాంతి, ఐక్యతను తీసుకురావాలి– జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి

విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి జిల్లా ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ వ్యవసాయానికి, సంస్కృతికి ప్రతీకగా నిలిచే మహత్తర పండుగ అని పేర్కొన్నారు. ఈ పండుగ జిల్లా ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, ఐక్యతను తీసుకురావాలని ఆకాంక్షించారు.అదేవిధంగా రైతులు, కూలీలు, ఉద్యోగులు, విద్యార్థులు సహా ప్రతి కుటుంబం ఆనందంగా పండుగను జరుపుకోవాలని, సంప్రదాయాలను కాపాడుకుంటూ భద్రతా నియమాలు పాటించాలని సూచించారు.ఈ సంక్రాంతి పండుగతో జిల్లా మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రజలందరి జీవితాల్లో నూతన ఆశలు, ఆశయాలు వికసించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *