లఖ్‌నవూలో మహిళా రైల్వేస్టేషన్
ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూ సిటీ రైల్వేస్టేషన్‌ను మొత్తం మహిళలే నిర్వహించే రైల్వేస్టేషనుగా మార్చారు. కంట్రోల్ రూం నుంచి టికెట్ల విక్రయం వరకు ప్రతి పని మహిళా ఉద్యోగుల చేతుల మీదుగానే సాగుతుందని రైల్వేశాఖ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రయాణికుల భద్రత, గస్తీ, సిగ్నల్ క్యాబిన్ల నిర్వహణ వంటి విధులకు మొత్తం 34 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. వీరంతా దేశంలోని విభిన్న ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. మహిళల సామర్థ్యం, నిబద్ధత, స్ఫూర్తికి అద్దం పట్టే ఈ స్టేషను నారీశక్తికి నిదర్శనమని ఈశాన్య రైల్వే అభివర్ణించింది.
