క్రికెటర్‌ స్మృతిమంధాన పెళ్లిలో బిగ్ ట్విస్ట్ ?

Smriti Mandhana

Smriti Mandhana

Smriti Mandhana Marriage Twist: టీమిండియా మహిళా స్టార్‌ క్రికెటర్‌ స్మృతిమంధాన (Smriti Mandhana) పెళ్లిలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. పలాష్ స్మృతిని మోసం చేసిన కారణంగానే పెళ్లి ఆగిపోయిందనే పుకార్లుబాగా వినిపిస్తున్నాయి. దీని గురించి ఎటువంటి నిర్ధారణ లేనప్పటికీ పలాష్ మాజీ గర్ల్‌ ఫ్రెండ్‌తో కలిసి ఉన్న ఫోటో, బిర్వా షాకి ప్రపోజ్‌ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2017 నాటి పోస్ట్‌లో మోకాళ్లపై వంగి అత్యంత రొమాంటిక్‌ వాతావరణంలో పలాష్ బిర్వాన ప్రపోజ్ చేస్తూ మోకాళ్లపై ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

స్మృతిమంధానకు సోషల్‌ మీడియాలో సపోర్ట్‌

Smriti Mandhana Marriage Twist: మరికొన్ని గంటల్లో తనను ప్రేమించిన వాడితో ఏడడుగులు నడిచేందుకు సిద్ధమవుతున్న తరుణంలో టీమిండియా మహిళా స్టార్‌ క్రికెటర్‌ స్మృతిమంధాన వివాహం రద్దు కావడంతో అటు అభిమానులు, ఇటు సామాన్యం జనం ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. పలాష్‌ ముచ్చల్‌ దారుణంగా ఆమెను మోసం చేశాడంటూ సోషల్‌ మీడియా గగ్గోలు పెడుతోంది. మరోవైపు ధైర్యంగా ఉండు, స్మృతి.. మంచే జరిగింది. ఆ మోసగాడి గురించి ముందే తెలిసింది అంటూ ఎక్స్‌ ద్వారా ఆమెకు మద్దతుగా నిలిచారు. దీనికి సంబందించి మెన్షన్‌ క్రికెట్‌ అనే ట్విటర్‌ హ్యాండిల్‌లో అనేక పోస్టులు, వీడియోలు వైరల్‌గా మారాయి. పుకార్లు నిజమే, పలాష్ నిజానికి స్మృతిని మోసం చేశాడన్న పోస్ట్‌కు భారీ స్పందన లభిస్తోంది.

మరోవైపు పలాష్‌ సోదరి పాలక్ ముచ్చల్ పట్ల సానుభూతి వ్యక్తమౌతోంది. ఈ పుకార్లు నిజమైతే సొంత సోదరుడి వల్ల ఆమెకు చెడ్డపేరు వస్తోందంటూ మరికొంతమంది కామెంట్స్‌ చేశారు. ఇండియాలో ఉత్తమ మహిళా నేపథ్య గాయకులలో ఒకరామె. పైగా పేద పిల్లల గుండె శస్త్రచికిత్సలకు నిధులు సమకూర్చడానికి ఒక NGOను నడుతున్న మంచిమనసున్న అద్భుతమైన వ్యక్తి అంటూ పేర్కొనడం విశేషం.

Also Read: భోగాపురం ఎయిర్ పోర్ట్ పై వైసీపీ నాయకుల వ్యాఖ్యలు దిగ్భ్రాంతికరం – కిమిడి నాగార్జున

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *