సీఐడీ మాజీ ఏడీజీ సునీల్ కుమార్‌కు సిట్ నోటీసులు

Sunil Kumar

Sunil Kumar

SIT notices to Sunil Kumar: రఘురామకృష్ణం రాజు (Raghu Rama Krishna Raju) పై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో సీఐడీ మాజీ ఏడీజీ పీవీ సునీల్ కుమార్‌కు నోటీసులు జారీ అయ్యాయి. డిసెంబర్ 4వ తేదీన విచారణకు రావాలని ఎస్పీ దామోదర్ నోటీసులు పంపారు. గుంటూరు సీసీఎస్‌కు రావాలని ఆదేశించారు. ఈ కేసులో ఏ1గా సునీల్‌ కుమార్‌ను విజయనగరం ఎస్పీ దామోదర్‌ విచారించనున్నారు.ఇప్పటికే ఈ కేసులో అప్పటి దర్యాప్తు అధికారి విజయపాల్, టీడీపీ నేత తులసిని పోలీసులు అరెస్ట్ చేశారు.

SIT notices to Sunil Kumar: కాగా, అప్పటి సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై రఘురామకృష్ణం రాజు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ 2021లో ఆయనపై సీఐడీ అధికారులు దేశద్రోహం కింద కేసు నమోదు చేశారు. ఆ ఏడాది మే 14వ తేదీన రఘురామ జన్మదినం రోజునే ఆయన్ను హైదరాబాద్‌ నుంచి బలవంతంగా గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆరోజు రాత్రి కస్టడీలో తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నానికి పాల్పడినట్లు రఘురామరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత సంవత్సరం జూలై 11న గుంటూరు నగరంపాలెం పోలీసు సేషన్లో కేసు నమోదైంది.

Also Read: ఆరెస్సెస్‌ సంపర్క్ ప్రముఖ్ రామ్‌లాల్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *