బాలల దినోత్సవ వేడుకల్లో సిరమ్మ
Children's Day Celebrations
Children’s Day Celebrations: నవంబరు 14వ తేదీ జాతీయ బాలల దినోత్సవం (Children’s Day) పురస్కరించుకొని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మెన్, వైసీపీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) స్వగృహం ధర్మపురి సమీపంలోని సిరిసహాస్ర రైజింగ్ ప్యాలస్ లో చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త చిన్న శ్రీను గారాల పట్టి, చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరిసహాస్ర (సిరమ్మ) అధ్యక్షతన నిర్వహించిన ఈ బాలల దినోత్సవ వేడుకల్లో… ధర్మపురితో పాటు పరిసర గ్రామాల పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిరమ్మ కేక్ కట్ చేసి… చిన్నారులకు స్వయంగా అందించారు. అనంతరం వారి పేరు, వివరాలు అడుగుతూ కాసేపు వారితో ఆడుకున్నారు. ఈ సందర్భంగా వారికి అనే వినోద కార్యక్రమాలు, ఆటపాటు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం బాలల హక్కులు, వారి భవిష్యత్తు నిర్మాణంలో విద్య ప్రాముఖ్యత గురించి ఆమో ప్రత్యేకంగా వివరించారు. అంతేకాదు ఈ వేడుకల్లో పాల్గొన్న చిన్నారులకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్, స్కేల్స్, జామెట్రీ బాక్స్ లు, ఇతర స్టేషనరీ సామాన్లు అందజేసారు. ఈ కార్యక్రమం చివరిలో బాలబాలికలకు ఆమె ఫలహారం స్వయంగా పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోట వాసు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Children’s Day Celebrations: ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… భారతదేశం మొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) పుట్టిన రోజు సందర్భంగా బాలల హక్కులు, విద్య మరియు పిల్లల సంక్షేమం గురించి అవగాహన పెంచడానికి ప్రతీ ఏటా బాలల దినోత్సవం జరుపుకుంటాం. ఈ రోజు మా బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించడం… చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పుడు బాలల దినోత్సవం వచ్చిందంటే చాలు… చాక్లెట్లు పంచుకుంటూ… చాచా నెహ్రూకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆ సందడి చేసేవాళ్ళం. నేటి బాలలే రేపటి పౌరులు. క్రమ శిక్షణ తో పెరిగే నేటి బాలలే… రేపటి సమాజంలో మంచి పౌరులుగా తయారవుతారు. సమ సమాజ నిర్మాణంలో బాలల పాత్ర ఎంతో కీలకం. కాబట్టి ఈ బాలల దినోత్సవ వేడుకలు మా ఇంట్లో నిర్వహించం చాలా ఆనందంగా ఉందన్నారు.

Also Read: భీమిలిలో ఎగసి పడిన వైసీపీ “ప్రజా ఉద్యమం”
