కర్నూలు బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ ఇవాళ తెల్లవారుజామున బస్సు బైకును ఢీ కొట్టి అగ్ని ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మంటలు చెలరేగడంతో 12 మంది ప్రయాణికులు అత్యవసర ద్వారాన్ని పగలగొట్టి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. భగ్గున చెలరేగిన మంటలు క్షణాల్లో వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది.
అయితే ఈ బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు . నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గోళ్లవారిపల్లికి చెందిన గోళ్ల రమేశ్ (35), భార్య అనూష (32), కుమారుడు యశ్వంత్(8), కూతురు మన్విత(6) సజీవ దహహం అయ్యారు. బెంగళూరులో రమేష్ కుటుంబం స్థిరపడింది. హైదరాబాద్ వెళ్లి బెంగళూరు వస్తుండగా ప్రమాదంలో వీరు మృతి చేశారు. మృతుల, బాధితుల కుటుంబాల్లో ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతులకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. మంత్రి రాం ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ఏపీకి చెందిన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
Also Read: బాలకృష్ణపై జగన్ వ్యాఖ్యలు సరికాదు – మంత్రి పార్థసారథి
