దిల్లీ ఎయిర్‌ పోర్టులో బస్సు దగ్ధం

Andhragazette - Delhi Airport

Andhragazette - Delhi Airport

Bus Catches Fire in Airport: దేశ రాజధాని దిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియాకు చెందిన ఓ బస్సు దగ్ధమైంది. ఎయిర్‌పోర్టులోని (Delhi Airport) మూడో టర్మినల్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ట్యాక్సీయింగ్‌ ఏరియాలో నిలిపి ఉంచిన విమానానికి అత్యంత సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ఆ సమయంలో బస్సులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్‌క్రాఫ్ట్ రెస్క్యూ సిబ్బంది, అగ్నిమాక సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేశారు. ట్యాక్సీయింగ్ ఏరియాలో నిలిపి ఉంచిన విమానానికి అత్యంత సమీపంలో ఈ ఘటన జరిగినప్పటికీ ఆ సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సు సమీపంలో ఉన్న విమానం దెబ్బతినలేదని, అందులోని ప్రయాణికులంతా సురక్షితమేనని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Bus Catches Fire in Airport: SATS ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అనే థర్డ్‌ పార్టీ ప్రొవైడర్‌ ఎయిరిండియాకు ఈ బస్సు సర్వీసులను అందిస్తోంది. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే బస్సుకు మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంపై ఎయిర్‌పోర్టు అధికారులు దర్యాప్తు చేపట్టారు. గ్రౌండ్ హ్యాండిలర్స్‌కు చెందిన బస్సు మధ్యాహ్నం సమయంలో మంటల్లో చిక్కుకుందని, అయితే ఏఆర్‌ఎఫ్ఎఫ్ నిపుణుల బృందం రెండు నిమిషాల్లోనే మంటలను అదుపు చేసిందని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో తెలియజేసింది. ఘటన సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో ఎవరికీ నష్టం జరగలేదని తెలిపింది. విమాన సర్వీసులు యథాప్రకారం నడుస్తున్నాయని తెలిపింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రత తమకు అత్యంత ప్రాధాన్యమని పేర్కొంది.

భారత్‌ లో విమానాల తయారీకు హెచ్‌ఏఎల్‌తో రష్యా సంస్థ ఒప్పందం

విమానాల విడిభాగాలు, హెలికాప్టర్ల తయారీలో ఎంతో పురోగతి సాధిస్తోన్న భారత్‌… పూర్తి స్థాయి ప్రయాణికుల విమానాల ఉత్పత్తి వైపు అడుగులు వేస్తోంది. దేశంలో ఎస్‌జే-100 జెట్‌ (Sukhoi Superjet 100) లను తయారు చేసేందుకు రష్యా యునైటెడ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ కార్పొరేషన్‌ (UAC) సిద్ధమైంది. ఈ మేరుకు హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ (HAL)తో యూఏసీ ఒప్పందం చేసుకుంది.

‘‘భారత్‌లో పూర్తి ప్రయాణికుల విమానం తయారు చేయనుండడం ఇదే తొలిసారి. గతంలో ఏవీఆర్‌ఓ హెచ్‌ఎస్‌-748 విమానాలను 1961లో తయారు చేయగా.. 1988లో ఆ ప్రాజెక్టు ముగిసింది. రానున్న పదేళ్లలో స్థానిక కనెక్టివిటీ కోసం ఎస్‌జే-100 వంటి చిన్న పరిమాణం కలిగిన 200 విమానాలు అవసరం. పౌర విమానయాన రంగంలో భారత్‌ ఆత్మనిర్భరత సాధించేందుకు ఈ ఒప్పందం కీలకంగా మారుతుంది’’ అని హెచ్‌ఏఎల్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశంలో ఉడాన్‌ పథకం కింద స్వల్ప దూర ప్రయాణాలకు గేమ్‌ ఛేంజర్‌గా మారనుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

ఎస్‌జే-100 రెండు ఇంజిన్లతో కూడిన చిన్న పరిమాణం కలిగిన విమానం. 103 మంది ప్రయాణికుల సామర్థ్యం ఉన్న ఈ విమానం.. స్వల్ప దూరం ప్యాసింజర్‌ సేవలకు అనువుగా ఉంటుంది. నిర్వహణ ఖర్చు కూడా తక్కువే. తాజా ఒప్పందంతో దేశీయ అవసరాలకు అనుగుణంగా ప్రయాణికుల విమానం తయారు చేసేందుకు హెచ్‌ఏఎల్‌కు వీలు ఉంటుంది. ఇప్పటికే రష్యా సంస్థ 200 విమానాలను తయారు చేయగా.. ప్రపంచవ్యాప్తంగా 16 ఎయిర్‌లైన్‌ సంస్థలు వీటిని నడిపిస్తున్నట్లు తెలిసింది.

Also Read: క్లౌడ్‌ సీడింగ్‌ ప్రక్రియకు దిల్లీ రెడీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *