జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కి తగిన బుద్ధి చెప్పాలి – కేటీఆర్

KTR-accuses-Congress-of-threats-extortion-in-Jubilee-Hills-bypoll.jpg

KTR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కి తగిన బుద్ధి చెప్పాలని…. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (K. T. Rama Rao) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. రెండేళ్లలో కేసీఆర్‌ (KCR)ని తిట్టడం తప్ప సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణకు ఏం చేశారని నిలదీశారు. శనివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే తాము మోసం చేసినా తమకు ఓటు వేశారని.. ఆ పార్టీ నేతలు చెబుతారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి కేటీఆర్.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులకి మధ్య సయోధ్య లేక కొట్టుకుంటున్నారని విమర్శించారు కేటీఆర్. కాంగ్రెస్ నేతలు జాదు గాళ్లు అని దెప్పిపొడిచారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో హామీలిచ్చి ఒక్క పైసా కూడా సీఎం రేవంత్‌రెడ్డి ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. ఓటు కోసం కాంగ్రెస్ నేతలు ప్రమాణం చేస్తారని.. ఆ తర్వాత పట్టించుకోరని ఎద్దేవా చేశారు. మళ్లీ కేసీఆర్‌ని అధికారంలోకి తెచ్చుకోవటానికి.. జూబ్లీహిల్స్ నుంచే జైత్రయాత్ర ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి కేటీఆర్.

అన్ని మతాల వారిని, అన్నివర్గాల వారిని కాంగ్రెస్ మోసం చేసిందని ఆక్షేపించారు. మైనార్టీ సబ్ ప్లాన్ పెడతామన్నారని.. అది కూడా ఎందుకు పెట్టలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. ఓటు అడగటానికి కాంగ్రెస్ నేతలు వస్తే బాకీ కార్డు చూపెట్టాలని సూచించారు. అవ్వా, తాతలకు రూ.4000 పెన్షన్ ఇస్తామని అన్నారని.. ఇచ్చారా? అంటూ నిలదీశారు. మహిళలకు రూ.2500 ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: చాదర్‌ఘాట్ కాల్పులపై స్పందించిన వీసీ సజ్జనార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *