సీఎం రేవంత్‌ రెడ్డితో కొండా దంపతుల భేటీ

CM_Revanth_Reddy_and_Konda_Family_002e380919_V_jpg--625x351-4g

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తో మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ భేటీ అయింది. ఈ దీపావళి పండుగ సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసానికి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి వెళ్లారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా కొండా దంపతుల వెంట సీఎం నివాసానికి వెళ్లారు.

తెలంగాణ కాంగ్రెస్ లో కొన్ని రోజులుగా మంత్రి కొండా సురేఖ విషయంలో వివాదం రేగుతోంది. దీనికి సంబంధించి ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్న సుమంత్‌ ను ఇటీవల తొలగించడం, ఆయన కోసం పోలీసులు మంత్రి ఇంటికి వెళ్లడం తదితర పరిణామాలు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ భేటీ జరిగినట్టు సమాచారం. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రి కొండా సురేఖ దంపతులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

మంత్రి కొండా సురేఖ దంపతులు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిల మధ్య వివాదం మొదలైంది. మేడారం టెండర్ల పంచాయతీ, డక్కన్‌ సిమెంట్‌ యాజమాన్యాన్ని బెదిరించినట్లు ఆరోపణలపై కొండా సురేఖ ఓఎస్‌డి సుమంత్‌ను తొలగించడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఆయన కోసం పోలీసులు సురేఖ నివాసానికి వెళ్లడం, అక్కడ మంత్రి కుమార్తె సుస్మిత అడ్డుకోవడమూ తీవ్ర చర్చకు దారితీసింది. వీటన్నింటిపై ఏఐసీసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో… ఇప్పుడు సీఎం రేవంత్‌తో కొండా దంపతులు భేటీ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *