సదర్ ఉత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి లుక్స్ అదుర్స్
హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ ఉత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అక్కడికి వచ్చిన ప్రజలకు అభివాదం చేసి, ఆప్యాయంగా చేతులు కలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్.. యాదవ సోదరులతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధిలో యాదవ సోదరుల భాగస్వామ్యం ఉందన్నారు. అధికారంలో, సంక్షేమంలో వారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రజా ప్రభుత్వం వచ్చాకనే సదర్ ఉత్సవానికి నిధులు ఇచ్చి అధికారికంగా నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా సీఎం వెల్లడించారు. ఇలా ఉండగా, సీఎం రేవంత్ ప్రజలతో మమేకమైన విధానం, తలపాగా ధరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో అందర్నీ విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
