భారత్‌తో దోస్తీకి బ్రెజిల్ ఆసక్తి

modi_a8a89bfa3e_V_jpg--625x351-4g

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధాల నేపథ్యంలో భారత్ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. పెద్ద మార్కెట్ కలిగిన భారత్‌తో స్నేహం చేసేందుకు పలు దేశాలు ముందుకు వస్తున్నాయి. భారత్ కూడా ఇతర దేశాలలో తమ ఉత్పత్తులకు మార్కెట్ పెంచుకునేందుకు ముందడుగు వేస్తోంది. ఈ నేపథ్యంలో బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డిసిల్వా భారత్‌తో స్నేహం కోసం తహతహలాడుతున్నారు. భారత మార్కెట్ అసాధారణ అవకాశాలను అందిస్తుందని పేర్కొన్నారు. ఈ సహకారం రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు (Lula Modi partnership).

బ్రెజిల్ ఉపాధ్యక్షుడు గెరాల్డో అల్క్‌మిన్ ఇటీవల భారత్‌లో పర్యటించారు. అల్క్‌మిన్ పర్యటనను ఉద్దేశిస్తూ అధ్యక్షుడు లూలా డిసిల్వా సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను తెలియజేశారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం రాజకీయ, అంతరిక్ష, ఆర్థిక రంగాలలో పురోగతికి సహాయపడుతుందని పేర్కొన్నారు. ఈ సహకారం ద్వారా రెండు దేశాలు అంతర్జాతీయ వేదికలపై బలమైన స్థానం సంపాదించే అవకాశం ఉందన్నారు. ఇరు దేశాలు కలిసి నడిస్తే టెక్నాలజీ, పారిశ్రామిక, మైనింగ్, వ్యవసాయ రంగాల్లో ఎంతో అభివృద్ధి ఉంటుందని లూలా డిసిల్వా పేర్కొన్నారు (India Brazil trade).

బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డిసిల్వా వచ్చే ఏడాది భారతదేశంలో పర్యటించనున్నారు (global south vs west). లూలా డిసిల్వా భారత్ పర్యటన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పర్యటన సమయంలో కొత్త ఒప్పందాలు, సహకార ఒడంబడికలు కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా, ఈ ఏడాది ఆగస్ట్‌లో భారత్, బ్రెజిల్ ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం చొప్పున సుంకాలు విధించిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *