పవన్ కల్యాణ్ ఓజీ నుండి కొత్త సాంగ్ వచ్చేసింది

maxresdefault (2)

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ఓజీ(OG). ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్‌ 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఈ చిత్రంలో ఇమ్రాన్‌ హష్మీ, ప్రకాశ్ రాజ్, శ్రియారెడ్డి, ప్రియాంక మోహన్ కీలక పాత్రల్లో నటించారు.

తాజాగా ఈ మూవీ నుంచి సాంగ్‌ను రిలీజ్ చేశారు. గన్స్‌ అండ్‌ రోజెస్‌ అనే ఫుల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు విశ్వ వేమూరి లిరిక్స్ అందించగా..హర్ష ఆలపించారు. ఈ మూవీకి తమన్ సంగీతమందించారు. ఈ సినిమా అక్టోబర్ 23 నుంచి ఓటీటీలో ప్రసారం కానుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *