నవంబర్ వరకు ఈ రాసుల వారికి రాజయోగమే !
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు, నక్షత్రాలు, రాశులపై ప్రభావం చూపుతాయి. ప్రతి నెల గ్రహాలు రాశి సంచారం లేదా నక్షత్ర సంచారం చేస్తుంటాయి. అయితే అక్టోబర్ 16 తర్వాత కొన్ని శక్తివంతమైన గ్రహాలు రాశి , నక్షత్ర సంచారం చేయనున్నాయి. దీంతో ఐదు రాశుల వారికి నవంబర్ వరకు రాజయోగం పట్టనుంది. కాగా, ఏ రాశుల వారికి లక్కు కలిసి వస్తుందో ఇప్పుడు చూద్దాం.
మేష రాశి : మేష రాశి వారికి అక్టోబర్ 16 నుంచి నవంబర్ 16 వరకు అదృష్టం తలుపు తడుతుందనే చెప్పాలి. ఎందుకంటే, శక్తివంతమైన గ్రహాలు సూర్యుడు, కుజుడు, శుక్రుడు, రాహువు గ్రహాలు ఈ రాశి వారికి అండగా ఉండనున్నాయి. దీని వలన వీరికి ఆదాయం పెరగడమే కాకుండా కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయి. ఈ నెల మొత్తం వీరికి లాభదాయకంగా ఉంటుంది.
వృషభ రాశి : వృషభ రాశి వారికి బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని గ్రహాలు చాలా అనుకూలంగా ఉంటాయి. అందువలన వీరికి ఆర్థిక స్థిరత్వం కలగుతుంది. కెరీర్ పరంగా కలిసి వస్తుంది. నూతన గృహం కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.
సింహ రాశి : సింహ రాశి వారికి గురు, శుక్ర, కుజ, బుధ, రాహువు గ్రహాల ప్రభావంతో ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. అంతే కాకుండా వీరు చాలా రోజుల నుంచి బాధపడుతున్న సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయం పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా వస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది.
కర్కాటక రాశి : ఈ రాశి వారికి ఊహించని విధంగా డబ్బు చేతికందుతుంది. విదేశాల్లో ఉన్నవారు కూడా ఆర్థికంగా అనేక ప్రయోజనాలు పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం దొరుకుతుంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.
తుల రాశి : తుల రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. నవంబర్ నెల వరకు వీరు కలలో కూడా ఊహించని లాభాలు పొందుతారు. అనుకోని విధంగా వీరి జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. ఉద్యోగస్థులు ఉన్నత పదువులు పొందుతారు. వ్యాపారంలో పెట్టుబడులు మంచి లాభాలను తీసుకొస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు జరగడంతో చాలా ఆనందంగా జీవిస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.
