క్రాకర్స్, బిర్యానీ రెండూ ఉంటేనే పండగ – వరలక్ష్మీ శరత్‌కుమార్‌

Varalaxmi_wedding_reception_1720090436654_1720090453833

‘‘దీపావళి అంటే దీపాలు… రంగు రంగుల ముగ్గులు… లక్ష్మీ పూజ. టపాసులకు మాత్రం నేను దూరం’’ అంటున్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్‌. అది మాత్రమే కాదు… తన జీవితంలో వెలుగులు నింపిన వ్యక్తి ఎవరో కూడా చెప్పారు. ఈ విశేషాలతో పాటు దీపావళి ముచ్చట్లను మీడియాతో వరలక్ష్మి ప్రత్యేకంగా పంచుకున్నారు.

నా చిన్నప్పటి దీపావళి పండగలన్నీ నాకు తీపి గుర్తులే. పండగ అంటే నాకు ముఖ్యంగా నచ్చేది కుటుంబ సభ్యులందరం కలవడం. ఇక దీపావళి అంటే మాకు పిండి వంటలు మాత్రమే కాదు… బిర్యానీ కూడా. టపాసులు, బిర్యానీ… ఈ రెండూ ఉంటేనే నాకు పరిపూర్ణంగా పండగ జరుపుకున్నట్లు ఉంటుంది. నేను టపాసులు కాల్చను… జస్ట్‌ చూడడం వరకే. ఇప్పుడు ఈ దీపావళికి బిర్యానీ లాగించడానికి రెడీ అయిపోయాను (నవ్వుతూ).

మా ఫ్యామిలీలో ఎవరు ఎంత బిజీగా ఉన్నా పండగల సమయంలో అందరం ఇంట్లో ఉండాలనే నియమం పెట్టుకున్నాం. నేను వేరే షూటింగ్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ బ్రేక్‌ తీసుకుని, చెన్నై వెళ్లాను. నా పుట్టింటివాళ్లు, అత్తింటివాళ్లు, స్నేహితులు… ఇలా అందరం కలుసుకునేలా ఏర్పాట్లు చేసుకున్నాం. మాకు అత్తింటిల్లో దీపావళి పండగకి ప్రత్యేకంగా ఆచరించాల్సిన నియమాలు ఏమీ లేవు. సో… చిన్నప్పట్నుంచి మా ఇంట్లో జరుపుకున్నట్లే అత్తింటికి వెళ్లిన తర్వాత కూడా జరుపుకుంటున్నాను.

దీపావళి అంటే రంగు రంగుల లైట్లు… బోలెడన్ని పువ్వులు. చాలా చక్కగా అలంకరిస్తాం. ఉదయం లక్ష్మీ పూజ చేయడం నుంచి సాయంత్రం దీపాలు పెట్టడం వరకూ ఇంట్లో ఉన్న అందరం కలిసి అన్నీ చేస్తాం. చిన్నప్పట్నుంచి నేను క్రాకర్స్‌కి కాస్త దూరం అని చెప్పాను కదా… నా హజ్బెండ్‌ (నికొలయ్‌ సచ్‌దేవ్‌) కూడా క్రాకర్స్‌కి దూరమే. కుటుంబం అంతా పండగపూట కలిసి ఉండటం ఆయనకు ఇష్టం. ఇక టపాసులు కాల్చాలనే మా సరదా పర్యావరణానికి హాని కలిగించేదిగా ఉండకూడదన్నది మా ఇద్దరి ఒపీనియన్‌.

నా జీవితంలో వెలుగులు నింపిన వ్యక్తి అంటే మా ఆయనే. ఎందుకంటే నిక్‌ నన్ను బాగా అర్థం చేసుకున్నారు. సపోర్టివ్‌గా ఉంటారు. డైరెక్షన్‌ చేయాలనే నా ఇష్టం తెలిసి, చేయమని ఆయనే ఎంకరేజ్‌ చేశారు. నిక్‌ నన్ను ప్రేమించడంతో పాటు నా మాటలకు విలువ ఇస్తారు. భార్యాభర్తల మధ్య ప్రేమతో పాటు ఒకరంటే మరొకరికి గౌరవం ఉండాలి. అప్పుడే ఆ బంధం బాగుంటుంది.

దీపావళి స్పెషల్‌ డైరెక్షన్‌

ఈ దీపావళికి నా కెరీర్‌ పరంగా స్పెషల్‌ అంటే ‘డైరెక్షన్‌’. దర్శకురాలిగా మారాలనే ఆలోచన ఎప్పట్నుంచో ఉంది. అయితే టైమ్‌ కుదరాలి. ఇప్పుడు సెట్‌ అయింది. దోస డైరీస్‌ బేనర్‌పై నా డైరెక్షన్‌లో ‘సరస్వతి’ టైటిల్‌తో రానున్న ఈ సినిమాని నా∙సోదరి పూజా శరత్‌కుమార్‌ నిర్మిస్తారు. ఈ సినిమాలో నేను నటిస్తాను కూడా. థ్రిల్లర్‌ మూవీగా ‘సరస్వతి’ ఉంటుంది. త్వరలో షూటింగ్‌ ఆరంభిస్తాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *