అల్లు అర్జున్-అట్లీ మూవీపై రణ్ వీర్ సింగ్ కామెంట్స్
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా అట్లీ దర్శకత్వంలో రానున్న పాన్ ఇండియా సినిమా ‘AA 22’ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ తన కామెంట్స్‌తో ఈ సినిమాపై హైప్‌ను పెంచేశారు. ఇందులో రణ్‌వీర్ సతీమణి దీపికా కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఈ సెట్‌ను సందర్శించినట్లు తెలిపారు. అట్లీపై (Atlee) ప్రశంసల వర్షం కురిపించారు.
‘‘అట్లీ జవాన్‌తో ఇండస్ట్రీలోనే టాప్‌లో ఒకరిగా నిలిచారు. భారతదేశంలో అతిపెద్ద దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అట్లీ ‘మెర్సల్’ చూశాక నేను మెసేజ్ చేశాను. ‘మీతో సినిమా తీయాలని ఉంది. మీరు ముంబయికి రండి’ అని చెప్పాను. ఆయన దర్శకత్వంలో వర్క్ చేయడం కోసం ఎదురుచూస్తున్నాను. ఆయనతో ఉంటే ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. నాకు మంచి స్నేహితుడు. నేను ఇటీవల అల్లు అర్జున్ సినిమా షూటింగ్ సెట్‌కు వెళ్లాను. సెట్ చూసి ఆశ్చర్యపోయాను. మీరు ఇప్పటివరకూ చూడని ఓ అద్భుతాన్ని అట్లీ మీకు చూపించనున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ ఇలాంటి చిత్రం రాలేదు’’ అని రణ్‌వీర్ పేర్కొన్నారు.
ఇక ఇటీవల అట్లీ కూడా ఈ సినిమా గురించి మాట్లాడిన విషయం తెలిసిందే. ‘‘ఏదైనా ఒక్క ఆలోచనతోనే ప్రారంభమవుతుంది. ఈ సినిమాతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడానికి మేం ప్రయత్నిస్తున్నాం. ఆడియన్స్ ఆశ్చర్యపోయేలా కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నాం’’ అని ఆయన చెప్పారు.
