4న జెఎన్‌యుఎస్‌యు ఎన్నికలు
దేశంలో ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు)లో విద్యార్థి సంఘ ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. జెఎన్‌యుఎస్‌యు ఎన్నికల కమిటీ గురువారం 2025-26 విద్యార్థి సంఘ ఎన్నికలకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. నవంబర్ 4న పోలింగ్ నిర్వహించి, 6న ఫలితాలు వెల్లడిస్తారు. ఈ నెల 24న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఓటరు జాబితా ప్రదర్శిస్తారు. నామినేషన్ పత్రాలు ఈ నెల 25న మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జారీ చేస్తారు. ఈ నెల 27న ఉదయం 9.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఈ నెల 28న ఉదయం 10 గంటలకు చెల్లుబాటు అయ్యే నామినేషన్ల జాబితాను ప్రదర్శిస్తారు. ఆ తరువాత అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 7 గంటలకు అభ్యర్థుల తుది జాబితా విడుదల చేస్తారు. అధ్యక్ష చర్చ నవంబర్ 2న జరుగుతుంది. నవంబర్ 4న రెండు సెషన్లలో పోలింగ్ జరుగుతుంది. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2ః30 నుండి సాయంత్రం 5.30 వరకు పోలింగ్ జరుగుతుంది. రాత్రి 9 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. తుది ఫలితాలు నవంబర్ 6న ప్రకటిస్తామని ఎన్నికల కమిటీ ఛైర్మన్ రవికాంత్ నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
