Firecrackers: బాణాసంచాను నిషేధించిన సిక్కిం
గాంగ్టక్ : దీపావళి (అక్లోబర్ 20)కి ముందు సిక్కిం బాణాసంచాపైనా, సింగిల్ యూజ్ ప్లాసిక్స్‌పైనా నిషేధం విధించింది. రాష్ట్రంలో అన్ని రకాల ధ్వని, కాంతిని వెదజల్లే బాణసంచాను పేల్చడం కానీ, వాటి అమ్మకంపైనా, తయారీపైనా సిక్కిం కాలుష్య నియంత్రణ బోర్డు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా టపాకుల్ని కాల్చవద్దని, సింగిల్ యూజ్ ప్లాసిక్స్ (ఒకసారి వాడి పడేసేవి) వాటిని ఉపయోగించొద్దని, పర్యావరణానికి హాని కలగకుండా ప్రత్నామ్నామైన వేడుకల్ని జరుపుకోవాలని పౌరులని కాలుష్య నియంత్రణ బోర్డు కోరింది.
కాగా, అలీఘర్‌లోని నుమై గ్రౌండ్‌లోని పటాకుల మార్కెట్‌లో వివిధ రకాల టపాసులు అందుబాటులో ఉంటాయి. ఈ మార్కెట్లో అందరినీ ఆకట్టుకునేలా ‘ఆపరేషన్ సింధూర్’, భారత క్రికెటర్ రింకు సింగ్ పేర్లతో ఉన్న బాణాసంచాను అమ్ముతున్నారు. దీంతో విపరీతంగా అమ్మకాలు పెరుగుతున్నాయి.
