దుర్గా బజార్ లో అన్న క్యాంటీన్ ను పరిశీలించిన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్
 
                విశాఖ నగరంలోని ఆరిలోవ ప్రాంతంలో గల దుర్గా బజార్ లో ఉన్న అన్న క్యాంటీన్ ను జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ పరిశీలించారు. వార్డు పర్యటనలో భాగంగా అన్న క్యాంటిన్ కు వెళ్ళిన కమిషనర్ కేతన్ గార్గ్… అందులో వండిన ఆహార పదార్థాలను పరిశీలించారు. ఆహారం రుచికరముతో పాటు సూచిక బోర్డులో ఉన్న విధంగా అందిస్తున్నారా అని ఆహారం భుజిస్తున్న వారిని అడిగి తెలుసుకున్నారు. అన్న క్యాంటీన్ వద్ద ఉన్న టోకెన్ సిస్టంను పరిశీలించి అన్న క్యాంటీన్లోని ఆహారంతో పాటు పరిశుభ్రత పాటించాలని మంచి రుచికరమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ కె . కనకమహాలక్ష్మి, సహాయ వైద్యాధికారి డాక్టర్ రవికుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు సచివాలయం కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

 
                         
                       
                      