అక్టోబర్ 21 రోజు రాశి ఫలాలు
దిన ఫలాలు (అక్టోబర్ 21, 2025): మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంది. అనుకున్న వ్యవహారాలు అనుకున్నట్టు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. అదనపు ఆదా యానికి లోటుండకపోవచ్చు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కొందరు బంధువులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపా రాలు బిజీగా సాగుతాయి. పిల్లలు పురోగతి సాధిస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఉద్యోగంలో సకాలంలో లక్ష్యాలను పూర్తి చేయగలుగుతారు. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుుతుంది. సోదరులతో స్థిరాస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆదాయం బాగా పెరుగు తుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఇంటా బయటా కొద్దిగా పని ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. కార్యసిద్ధి, వ్యవ హార జయం ఉంటాయి. పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం అనుకూలంగా సాగిపో తుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) వృత్తి, వ్యాపార, ఉద్యోగాల వాతావరణం అనుకూలంగా, ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్య, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో కలిసి ఆలయాలకు వెళ్లే అవకాశం ఉంది. ఆరోగ్య భంగమేమీ ఉండకపోవచ్చు. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతా వరణం ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా పురోగమిస్తాయి. ప్రముఖుల నుంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన శుభ సమాచారం అందుతుంది. కొత్త వస్తు లాభాలకు అవ కాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగి పోతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాల పరిస్థితి కూడా ఆశాజనకంగా ఉంటుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమాత్రం లోటుండకపోవచ్చు. కొందరు బంధువుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబ జీవితంలో సామరస్యం పెరుగుతుంది. ఆర్థికంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతల్ని సకాలంలో, సంతృప్తికరంగా నిర్వర్తిస్తారు. వ్యాపారాల్లో ఆశించిన పురో గతి ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు, ప్రయ త్నాలతో ముందుకు వెడతారు. ముఖ్యమైన కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రయా ణాల్లో మంచి పరిచయాలు ఏర్పడతాయి. మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఆధ్యా త్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాలు నిర్వహిస్తారు. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ఉద్యోగంలో మీ సమర్థతకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో సన్నిహి తుల నుంచి శుభవార్తలు వింటారు. సొంత పనుల దృష్టి పెట్టడం మంచిది. అవసరానికి ఉపయో గించుకునేవారు దగ్గర చేరతారు. వృత్తి జీవితం బాగా బిజీ అవుతుంది. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట) ఇష్టమైన బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. కొందరు మిత్రులకు ఆర్థికంగా అండగా నిల బడతారు. ఉద్యోగంలో అధికారులు, సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి పెరుగుతాయి. ఆదాయ మార్గాలు ప్రోత్సాహకరంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇంట్లో శుభకార్యాల నిర్వహణకు ప్లాన్ చేస్తారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపో తుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా ఉపయోగకరంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు సకా లంలో పూర్తవుతారు. స్థిరాస్తి వ్యవహారాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచ నాలకు మించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగాల్లో పని ఒత్తిడి, పని భారం నుంచి బయటపడతారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండాలి. కొందరు మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యో గరీత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి అవసరానికి సహాయ సహ కారాలు అందుతాయి. అదనపు ఆదాయానికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో కొద్దిగా రాబడి పెరుగు తుంది. వృత్తి జీవితంలో విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ వ్యవహారాలలో బాగా ఒత్తిడి ఉంటుంది. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) కొద్ది ప్రయత్నంతో ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. శ్రమ, తిప్పట ఉన్నప్పటికీ, ముఖ్యమైన ఆర్థిక, ఆస్తి వ్యవహారాలను చక్కబెడతారు. ప్రయాణాలో డబ్బు వృథా అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా శ్రమ పెరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో సహచరుల నుంచి ఇబ్బం దులు ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ జీవితం చాలావరకు సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు ప్రవేశపెట్టి లాభాలు అందుకుంటారు. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. బంధువులతో అపార్థాలు తొలగిపోతాయి. వ్యయ ప్రయాసలు ఎక్కువగానే ఉన్నప్ప టికీ, ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. తల్లితండ్రుల నుంచి అండదండలు లభిస్తాయి. ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.
