బీజేపీలోకి ‘అనర్హత’ ఆర్జేడీ నేత

newindianexpress_2025-10-22_32da5huf_Anil-Sahni

అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్‌ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. బీహార్‌ లో నేతల జంప్‌ జిలానీ వ్యవహారాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఆర్జేడీ నేత అనిల్‌ సహానీ బుధవారం బీజేపీలో చేరారు. విశేషం ఏమిటంటే ఈయనను మూడేళ్ల క్రితం మోసం కేసులో సీబీఐ కోర్టు దోషిగా తేల్చి శిక్ష విధించటంతో అనర్హత వేటు పడి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కోల్పోయారు.

2012లో ఆయన ఆర్జేడీ రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు ఫోర్జరీ విమాన టికెట్లు సమర్పించారని సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ కేసులో సీబీఐ కోర్టు విచారణ జరుపుతుండగానే 2020లో ఆర్జేడీ తరఫున కుర్హానీ నియోజవర్గంలో పోటీచేసి బీజేపీ నేత కేదార్‌ గుప్తను ఓడించి ఎమ్మెల్యేగా గెలిచారు. మూడేళ్ల క్రితం కోర్టు అనిల్‌ను దోషిగా తేల్చటంతో అసెంబ్లీ సభ్యత్వం కోల్పోయారు. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో కేదార్‌ గుప్త గెలిచి, రాష్ట్ర మంత్రి అయ్యారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ జాతీయ కార్యదర్శి వినోద్‌ తావ్‌డేల సమక్షంలో అనిత్‌ సహానీ బీజేపీలో చేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *