‘జీవిక దీదీ’లకు ఆర్జేడీ బంపర్‌ ఆఫర్‌

maxresdefault (1)

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు కీలక హామీలతో ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో రాష్ట్రీయ జనతా దళ్‌(ఆర్జేడీ) నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకుని భారీ ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా స్వయం సహాయక బృందాల సభ్యు(జీవిక దీదీ)లకు ఆయన బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు.

‘‘ రాష్ట్రంలో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కారి్మకులందరి ఉద్యోగాలను పరి్మనెంట్‌ చేస్తాం. జీవిక దీదీలుసహా మొత్తం 2,00,000 మంది కమ్యూనిటీ మొబిలైజర్‌ల ఉద్యోగాలను క్రమబదీ్ధకరిస్తా. కమ్యూనిటీ మొబిలైజర్‌లకు రూ.30,000 గౌరవ వేతనం అందిస్తా’’ అని తేజస్వీ ప్రకటించారు. ప్రపంచబ్యాంక్‌ ఆర్థికసాయంతో బిహార్‌ గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో ‘జీవిక’ పథకాన్ని ప్రారంభించడం తెల్సిందే.

రూ.2,000 అదనపు అలవెన్స్‌

‘‘మా ప్రభుత్వం వస్తే జీవిక దీదీలు ఇప్పటికే తీసుకున్న రుణాలను మాఫీ చేస్తా. వచ్చే రెండేళ్లపాటు ఇలాంటి వడ్డీ లేని రుణాలు మంజూరుచేస్తా. జీవిక దీదీలు అందరికీ రూ.5 లక్షల విలువైన ఆరోగ్యబీమా సౌకర్యం కల్పిస్తాం. ప్రభుత్వకార్యక్రమాల్లో నిమగ్నమైన వారికి నెలకు అదనంగా రూ.2,000 అలవెన్స్‌ ఇస్తా’’ అని తేజస్వీ అన్నారు. బిహార్‌లో ప్రస్తుతం దాదాపు 1.45 కోట్ల మంది జీవిక దీదీలున్నారు. ‘‘తాము అధికారంలోకి వస్తే 20 రోజుల్లోçపు ఉపాధి గ్యారంటీ పథకం తెస్తా. 20 నెలల్లోపు ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చేస్తా’’ అని తేజస్వీ గతంలోనే ప్రకటించడం తెల్సిందే. ‘‘జీవిక దీదీలకు లభిస్తున్న గౌరవ వేతనం చాలా తక్కువగా ఉంది. వారి సేవలకు తగిన గుర్తింపు లభించడం లేదు’’ అని నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వంపై తేజస్వీ మండిపడ్డారు. ‘‘ నామినేషన్ల పర్వం ముగిసింది. ప్రచారం జోరుమీదుంది. పాలనాపగ్గాలు ఎన్‌డీఏ కూటమి ఇవ్వకూడదని ఓటర్లు నిర్ణయించుకున్నారు. డబుల్‌ ఇంజిన్‌ మోతతో ఓటర్ల చెవులకు చిల్లులు పడ్డాయి. డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాలు, అవినీతి, నేరాలు నితీశ్‌ హయాంలో పెరిగాయి. నిరుద్యోగం, వలసలతో ప్రజలు విసిగిపోయారు’’ అని తేజస్వీ వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *