ఈ నెల 15న కోటి సంతకాలు ప్రతులు తరలింపు – భీమిలి సమన్వయకర్త చిన్న శ్రీను
Majji Srinivasarao
Majji Srinivasarao on Signature Campaign: మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) పిలుపుమేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ… భీమిలి నియోజకవర్గంలో విజయవంతంగా ముగింది. ఉమ్మడి విజయనగరం జిల్లా జెడ్పీ చైర్ పర్సన్, జిల్లా పార్టీ అధ్యక్షులు, భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) ఆధ్వర్యంలో నియోజకవర్గం నలుమూలల కోటి సంతకాల సేకరణ చేపట్టారు. పార్టీ కార్యక్రమాలు మరియు ఉమ్మడి విజయనగరం జిల్లా జెడ్పీ పరిపాలనలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ… భీమిలి నియోజకవర్గం సమన్వయకర్తగా కోటి సంతకాల సేకరణను మాత్రం అప్రతిహాతంగా నిర్వహించారు.

Majji Srinivasarao on Signature Campaign: భీమిలి సమన్వయకర్త చిన్న శ్రీను గారాల పట్టి సిరి సహస్ర (సిరమ్మ)… ఈ కోటి సంతకాల సేకరణలో భాగస్వామ్యం వహిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. తండ్రి ఆదేశాలు, పార్టీ ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో మమేకం అవుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసారు. ఈ నేపథ్యంలో భీమిలి నియోజకవర్గంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రతులను… రాష్ట్ర కార్యాలయంకు పంపిచేందుకు విస్తృత ఏర్పాట్లు చేసారు. కోటి సంతకాల ప్రతులను రాష్ట్ర కార్యాలయానికి ఈ నెల 15న పంపించనున్న నేపథ్యంలో… భీమిలి నియోజకవర్గం వైసీపీ నాయకులతో సమన్వయకర్త చిన్న శ్రీను, అతని కుమార్తె సిరమ్మ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ నెల 15న నిర్వహించబోయే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు. అలాగే ఈ కార్యక్రమంను విజయవంతంగా పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేసారు.

ఈ సమావేశంలో చిన్న శ్రీను గారు మాట్లాడుతూ… ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటుపరం చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో కోటి సంతకాల ఉద్యమానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది. కోటి సంతకాల సేకరణకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరధం పట్టారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీన అనగా సోమవారం ఉదయం 10 గంటలకు విశాఖ నగరంలోని జీఎంసీ గాంధీ విగ్రహం నుంచి భారీ బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నాము. ప్రభుత్వ వైద్య కళాశాలలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. ప్రైవేటుపరమైతే పేద మరియు మధ్యతరగతి ప్రజలు వైద్య సేవలకు దూరమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రజలు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం పరిశీలకులు తైనాల విజయ్ కుమార్ , ఎంపీపీలు జడ్పిటిసిలు వార్డు కార్పొరేటర్లు ఎంపీటీసీలు పలురు నాయకులు, వైస్ ఎంపీపీలు, సర్పంచులు , వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, మహిళా నాయకులు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Also Read: రంగస్థల కళాకారులను అభినందించిన జెడ్పీ చైర్ పర్సన్ చిన్న శ్రీను
