కోట్లాదిమంది భారతీయుల గుండెచప్పుడు వందేమాతరం- భీశెట్టి బాబ్జి

Loksatta Leader Beesetti Babji

Loksatta Leader Beesetti Babji

Loksatta Leader Beesetti Babji: కోట్లాదిమంది భారతీయుల గుండెచప్పుడు వందేమాతరం అని లోక్ సత్తా (Loksatta) పార్టీ రాష్ట్ర అధ్యక్షులు భీశెట్టి బాబ్జి పేర్కొన్నారు. వందేమాతరం గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షుడు సముద్రాల గురు ప్రసాద్ ఆధ్వర్యంలో గురజాడ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా భారతీయుల దేశభక్తికి ప్రతీక వందేమాతరం, భారతీయుల గుండెల్లో శాశ్వతంగా స్థానాన్ని సంపాదించిందని ఆయన అభివర్ణించారు. వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా…. కేంద్ర ప్రభుత్వం ఏడాది పొడుగునా వేడుకలు నిర్వహించి అభినందనీయమన్నారు.

Loksatta Leader Beesetti Babji: తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షుడు గురు ప్రసాద్ మాట్లాడుతూ 150 ఏళ్ల క్రితం బంకిం చంద్ర చటర్జీ కలం నుండి జాలువారిన వందేమాతరం భారతీయులకు స్వాతంత్ర స్ఫూర్తిని కలిగించిన మంత్రమని, భారత జాతికి జాగృతి గీతంగా నిలిచిందని అన్నారు. వందేమాతరం గీతం భారత జాతి భావోద్వేగాలను వీణ వలె మీటిందని, భారతీయుల వెన్ను తట్టి స్వాతంత్ర సమపార్జన కోసం సమష్టి కార్యాచరణకు బాటలు వేసిందనిఅన్నారు.ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఎం వి ఆర్ కృష్ణాజి, కుసుమంచి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కుసుమంచి సుబ్బారావు , ఆర్ఎస్ఎస్ కు చెందిన టి.పరమహంస ,టి రాజారావు , భారతీయ జనతా పార్టీ విజయనగరం పట్టణ విభాగం నార్త్ అధ్యక్షులు ఈమంది సుధీర్,పాఠశాల కరస్పాండెంట్ స్వరూప ,ప్రధానోపాధ్యాయులు పూడి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: ఈ నెల 9న జిల్లాస్థాయి బాలల ఆహ్వాన నాటికలు పోటీలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *