ఘనంగా అఖిలభారత శిష్ఠకరణ సంఘం శతాబ్ది ఉత్సవాలు

All India Sistakaranam Association

All India Sistakaranam Association

All India Sistakaranam Association : శ్రీకాకుళం (Srikakulam) జిల్లా జలుమూరు మండల కేంద్రంలో అఖిలభారత శిష్ఠకరణ సంఘం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. 1925 నవంబర్ లో ఏర్పాటు అయిన అఖిల భారత శిష్ట కరణ సంఘము… 09 నవంబర్ 2025 నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా… అఖిల భారత శిష్ట కరణ సంఘము అధ్యక్షులు D.V.కృష్ణారావు ఆధ్వర్యంలో శిస్టకరణ లోగో లో ప్రధానమైన సిరా బుడ్డి, పాలి పెన్ను తో ఏర్పాటు చేసిన స్తూపంను ఏర్పాటు చేసారు. శిస్టకరణ లోగో స్థూపాన్ని రైల్వే రిటైర్డ్ జిఎం యూజే ఎం రావు, రాష్ట్ర శిష్ట కరణ సంఘం కార్యదర్శి జయబాబు, డాక్టర్ వాసంతిలు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా అఖిల భారత శిష్ట కరణ సంఘం అధ్యక్షులు డివి కృష్ణారావు మాట్లాడుతూ… శిష్ట కరణముల ఐక్యతకు నిదర్శనం ఈ స్తూపము అని అన్నారు. మనందరం ఇదేవిధంగా ఐక్యతతో మనకు అతి ముఖ్యమైన ఓ బి సి సాధన కోసం పనిచేయాలని ఆయన కోరారు.

All India Sistakaranam Association: ఈ కార్యక్రమంలో సుధాకర్ పట్నాయిక్ మాట్లాడుతూ… శిష్టకరణ సంఘం చరిత్రలోనే ఇది గొప్ప విషయం అని… కులసంఘం గుర్తింపు కోరకు స్తూపాన్ని నిర్మించిన ఘనత చరిత్రలో మనకే దక్కిందన్నారు. మన తరువాత తరం కూడా శిష్ట కరణ కులాభివృద్ధి కి ఆలోచించే విధంగా ప్రణాళికలు తయారు చేయాలని ఆయన సూచించారు. ఆర్దికంగా ఉన్నత స్థానంలో ఉన్న వారు మిగిలిన వారికి చేయుతనివ్వాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర శిష్ట కర్ణ సంఘం కార్యదర్శి జయ బాబు, కీర్తిశేషులు ఏవి జగన్నాధరావు గారి సతీమణి లిలా కుమారి, కుమార్తె డాక్టర్ వాసంతి, ఉపాధ్యక్షులు సుధాకర్ పట్నాయక్, అడ్మిన్ సెక్రెటరీ సదాశివని కృష్ణ, కోశాధికారి బిఆర్ఎం పాత్రో, బెహరా భాస్కర రావు, విజయనగరం జిల్లా నుంచి రేగ సురేష్, వాండ్రంగి వెంకటేష్, లావర ప్రభాత్ కుమార్ లు, శ్రీకాకుళం జిల్లా శిష్టకరణ సంఘం అధ్యక్షులు డబ్బీరు శ్రీనివాసరావు, ఒరిస్సా, ఛత్తీస్గడ్ రాష్ట్రాల నుండి, విశాఖపట్నం, మన్యం జిల్లాల నుంచి సంఘ నాయకులు మరియు బంధుమిత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Also Read: దాతృత్వం చాటుకున్న చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *