విశాఖ యారాడ తీరంలో బ్లూ వేల్
Blue vel
విశాఖ యారాడ తీరంలో తిమింగలం కలకలం రేపింది. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల వలలో బ్లూ వేల్ గా చెప్పుకునే ఈ తిమింగలం చిక్కుకుంది. తీరానికి చేరుకున్న తర్వాత గుర్తించిన మత్స్యకారులు తిరిగి సముద్రంలోకి పంపించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ఆ తిమింగలం మృత్యువాత పడింది. దీన్ని చూసేందుకు పరిసర ప్రాంతాల నుంచి సందర్శికులు అధిక సంఖ్యలో యారాడ తీరానికి చేరుకుంటున్నారు.
