విజయనగరం జిల్లాకు ‘బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్’ అవార్డు

Dist Collector Ramsundar reddy

Dist Collector Ramsundar reddy

ఎన్నికల నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు గాను విజయనగరం జిల్లాకు రాష్ట్ర స్థాయి పురస్కారం లభించింది. “బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు – 2025” కు విజయనగరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. రాంసుందర్ రెడ్డి ఎంపికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి మంగళవారం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.జిల్లాలో ఓటరు జాబితా రూపకల్పన, ఓటర్ల నమోదు ప్రక్రియ మరియు ఎన్నికల విధుల్లో పాటించిన అత్యుత్తమ విధానాలను గుర్తిస్తూ ఈ అవార్డును ప్రకటించారు. గతంలో విజయనగరం జిల్లా కలెక్టరుగా పనిచేసిన డా. బి.ఆర్. అంబేద్కర్ కూడా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.అదేవిధంగా బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డుకు జిల్లా రెవెన్యూ అధికారి, కెఆర్ఆర్సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఈ.మురళి, ఉత్తమ బిఎల్ఓగా (గజపతినగరం నియోజకవర్గం, బొండపల్లి మండలం పోలింగ్ బూత్ -161) ఎల్.సత్యనారాయణ ఎంపికయ్యారు.ఈ నెల 25వ తేదీన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించే కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.జిల్లాకు ఈ గౌరవం దక్కడం పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, జిల్లా యంత్రాంగం హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *