రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత వైద్యం-కలెక్టర్
vizianagaram Collector
రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత వైద్య సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే గుర్తింపు పొందిన ఆసుపత్రిలో సుమారు రూ.1.50 లక్షలు విలువైన వైద్యాన్ని ఉచితంగా పొందవచ్చు. దీనికోసం జిల్లా కలెక్టర్ బ్యాంకు ఖాతాను పీఎఫ్ఎంఎఫ్ కు అనుసంధానం చేయాల్సి ఉంది. వీరికోసం శుక్రవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఎంఓఆర్టిహెచ్ (మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్) అధికారులు విధివిధానాలను వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, ఐఆర్ఏడి జిల్లా మేనేజర్ ఎం.శ్రీధర్ పాల్గొన్నారు.
