పట్టాదారు పాసు పుస్తకాల KYC ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి
Dist collector S.Ramsundar reddy
గొల్లలపేట పంచాయతీ పరిధిలోని సారిక రెవిన్యూ గ్రామంలో విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ముందుగా గ్రామ సచివాలయాన్ని సందర్శించిన కలెక్టర్, సచివాలయం సిబ్బంది పనితీరును పరిశీలించి పలు సూచనలు చేశారు.అనంతరం పట్టాదారు పాసు పుస్తకాల KYC ప్రక్రియను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. అదేవిధంగా ఇద్దరు లబ్దిదరుల ఇళ్లకు స్వయంగా వెల్లి లబ్ధిదారులతో నేరుగా చర్చించి, పట్టాదారు పాసు పుస్తకాల నమూనా ప్రతులను వారి వివరాలతో సరిపోల్చి పరిశీలించారు. రైతుల భూ వివరాలు, వ్యక్తిగత సమాచారం సరిగా నమోదయ్యాయా లేదా అనే అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పట్టాదారు పాసు పుస్తకాల KYC ప్రక్రియలో గుర్తించిన తప్పులను సవరణ చేసిన అనంతరం, మార్చి 10 వ తేదీలోగా పట్టాదారు పాసు పుస్తకాలను లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లకు అవకాశం లేకుండా అత్యంత జాగ్రత్తగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల సంతృప్తే లక్ష్యంగా పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు.ఈ ఆకస్మిక తనిఖీ కార్యక్రమంలో ఆర్డీవో డి. కీర్తి, తాసిల్దార్ కుర్మనాధ్, సచివాలయ సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు.
