నిరుపయోగంగా ఉండే వీల్ చైర్లను అందజేయండి-జనవిజ్ఞాన వేదిక
jana vijnaana vedika
ఎవరి వద్దనైనా నిరుపయోగంగా ఉండే వీల్ చైర్లు,ఊత కర్రలు, లేవెట్రీ స్టాండ్లను అవసరమైన వారికి అందజేయాలని జనవిజ్ఞాన వేదిక జిల్లా కోశాధికారి,అఖిల భారత అవయవదాతల సంఘం రాష్ట్ర కార్యదర్శి షిణగం శివాజీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బొబ్బాధిపేటకు చెందిన దివంగత కొల్లి వెంకట నాయుడు సతీమణి కొల్లి పద్మిని తన ఇంట్లో నిరుపయోగంగా ఉన్న వీల్ చైర్, ఊత కర్ర,లేవట్రీ స్టాండను మంచానికి పరిమితమైన గరివిడి మండలం కొండశంభం గ్రామానికి చెందిన గొర్లె పెంటమనాయుడుకు అందజేశారు.ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ మా కుటుంబ మిత్రులైన దివంగత కొల్లి వెంకట నాయుడు ఇంట్లో నిరుపయోగంగా ఉన్న వీటిని ఇన్సైట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గొర్లె చిన్నమనాయుడు ద్వారా పెంటమనాయుడు మంచానికి పరిమితమైనట్లు తెలుసుకొని వీటిని వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగిందని తెలిపారు.ఈ విధంగా ఎవరి ఇండ్లలోనైనా ఇటువంటి పరికరాలు నిరుపయోగంగా ఉంటే మంచానికి పరిమితమైన నిరుపేద రోగులకు అందజేస్తే ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాళ్ళ రామారావు, బోర గోవిందమ్మ పాల్గొన్నారు.
