ఉన్నత శిఖరాలకు బాటలు వేసే మార్గదర్శి మంచి పుస్తకం
pustaka samiksha
ఉన్నత శిఖరాలకు బాటలు వేసే మార్గదర్శి మంచి పుస్తకం అని , పుస్తక పఠనం వల్ల బుద్ధి కుశలత ఏకాగ్రత పెరుగుతుందని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్ పేర్కొన్నారు .సీతం కళాశాల బుక్ రీడర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన పుస్తక సమీక్ష పోటీల్లో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ అసిస్టెంట్ లైబ్రేరియన్ డాక్టర్ నారాయణ న్యాయ నిర్నేతగా పాల్గొన్నారు. సందర్భంగా అయన మాట్లాడుతూ పుస్తక పఠనం మనసుని వికసింప చేస్తుందని మనోవికాసాన్ని పెంచుతుందని గతాన్ని వర్తమానానికి ,వర్తమానాన్ని భవిష్యత్తుకు అనుసంధానం చేసే అద్భుత శక్తి పుస్తకం అని అన్నారు. పోటీలలో అధ్యాపక విభాగంలో ఎం. ప్రసన్న ,విద్యార్థి విభాగంలో జి.ఉమా దాక్షాయిని విజేతగా నిలిచారు .గత ఏడాది కాలంలో వివిధ రంగాలలో ప్రతిభను కనబరిచిన 30 మంది విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం జిల్లా శాఖ అధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్ , కాలేజ్ డైరెక్టర్ డాక్టర్ ఎం శశిభూషణరావు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డివి రామ్మూర్తి ,కుసుమంచి సుబ్బారావులతో కలిసి ప్రశంసా పత్రాలను అందజేశారు.
